Omicron In Telangana: తెలంగాణ‌లో ఒమైక్రాన్ టెన్ష‌న్‌… ఓ మ‌హిళ‌కు పాజిటివ్‌…?

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. ఇప్ప‌టికే ఇత‌ర దేశాల నుంచి ఇండియాకి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై వైద్య ఆరోగ్య‌శాఖ నిఘా పెట్టారు.

  • Written By:
  • Updated On - December 2, 2021 / 11:13 PM IST

క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. ఇప్ప‌టికే ఇత‌ర దేశాల నుంచి ఇండియాకి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై వైద్య ఆరోగ్య‌శాఖ నిఘా పెట్టారు.అయితే తాజాగా తెలంగాణ‌లో ఒమైక్రాన్ వేరియంట్ టెన్ష‌న్ మొద‌లైంది. బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన ఓ మ‌హిళ‌కు ఒమైక్రాన్ పాజిటివ్ గా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. స‌ద‌రు మ‌హిళ‌ను గ‌చ్చిబౌలి టిమ్స్ కి త‌ర‌లించారు. శాంపిల్స్ ని జీనోమ్ సీక్వేన్సింగ్ కు పంపిచారు

ఒమైక్రాన్ వేరియంట్ పై తెలంగాణ ప్ర‌భుత్వం అప్ప‌మ‌త్త‌మైంది. తెలంగాణ హైల్త్ డైరెక్ట‌ర్ అత్య‌వ‌స‌ర మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ క్ష‌ణం నుంచి ప్ర‌జ‌లంద‌రూ మాస్క్ ధ‌రించాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ సీజ‌న్ ని తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. ఈ వేరియంట్ ఏ క్ష‌ణ‌మైన భార‌త్ లోకి ప్ర‌వేశించ‌వ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. డెల్టా వేరియంట్ కంటే ఇది ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని నిపుణ‌లు చెప్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ పూర్తి అయింద‌ని…వ్యాక్సిన్ వేసుకోని వారు త‌ప్ప‌నిస‌రిగా వేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

సుమారు 25 ల‌క్ష‌ల మందికి పైగా రెండ‌వ డోసు వ్యాక్సిన్ తీసుకోలేద‌ని ఆయ‌న తెలిపారు.వీరంతా త్వ‌రగా వ్యాక్సిన్ తీసుకోవాల‌న్నారు. వీరిలో ఎక్కువ మంది జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్నార‌ని తెలిపారు. కొత్త వేరియంట్ పై తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటుద‌ని..ప్ర‌జ‌లు కూడా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న కోరారు.