Site icon HashtagU Telugu

Revanth Reddy: బల్మూరు వెంకట్ కు రేవంత్ పరామర్శ

Revanth

Revanth

సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో వెంకట్ అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ తనతో పోలీసులు వ్యవహరించిన తీరును రేవంత్ రెడ్డికి వివరించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వెంకట్ కు రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు.