Site icon HashtagU Telugu

Revanth Reddy : కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’ అంటూ రేవంత్ ట్వీట్

Revanth Fire On Brs

Revanth Fire On Brs

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్..కాంగ్రెస్ ప్రచారం లోనే కాదు సోషల్ మీడియా లోను కేసీఆర్ ఫై , బిఆర్ఎస్ ఫై విమర్శలు చేస్తూ దూకుడు కనపరుస్తున్నాడు. తాజాగా కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలురాయి అంటూ తనదైన శైలి లో ట్వీట్ చేసాడు. నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం అంటూ ‘ఎక్స్‌’వేదికగా వ్యాఖ్యానించారు.

మొన్నటికి మొన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda ) పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం సంచలనం రేపగా..తాజాగా అన్నారం బ్యారేజ్ (Annaram Saraswati Barrage ) కింది నుంచి దిగువకు భారీగా నీరు లీకవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దీనిపై ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం..అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు..’ప్రాజెక్టు అంటే నీ ఫామ్‌ హౌస్‌కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్లు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ. లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగు కోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు’అని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం.. మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు.. రూ. లక్ష కోట్ల అవినీతి’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఇదిలా ఉంటె ఈరోజు ఉదయం రాహుల్ మేడిగడ్డ బ్యారేజీని (Rahul Gandhi To Inspect Medigadda Barrage ) పరిశీలించారు. రాహుల్ తో పాటు రేవంత్ (Revanth) , భట్టి (Bhatti) , శ్రీధర్ బాబు (Sridhar Babu) తదితరులు బ్యారేజ్ ను పరిశీలించి , రాహుల్ హైదరాబాద్ కు బయలుదేరారు. రాహుల్ రావడంతో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన భారీ క్రేడ్లను తోసుకుంటూ ప్రజలు మేడిగడ్డ వైపు తరలివస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది.

Read Also : Chandrababu Bail : జగన్ లండన్లో ఉండి బాబును అరెస్ట్ చేయిస్తే..పవన్ ఇటలీ లో ఉండి బెయిల్ ఇప్పించాడు