Site icon HashtagU Telugu

Revanth Reddy: కీచక రాఘవ ఎక్కడ? ప్రగతి భవన్ లోనా.. ఫాంహౌస్ లోనా?

Revanth reddy

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచ‌లో ఇటీవ‌ల ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌లో నిందితుడు వ‌న‌మా రాఘ‌వ వ్య‌వ‌హారంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కీచక రాఘవ ఎక్కడ? అని ఆయ‌న నిల‌దీశారు. రాఘ‌వ ప్ర‌స్తుతం ప్రగతి భవన్ లో ఉన్నాడా?.. ఫాంహౌస్ లో ఉన్నాడా? అంటూ ప్ర‌శ్నించారు.

అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్టు చేసిన పోలీసులు మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దుర్మార్గుడిని కాపాడుతున్న ఆ.. అదృశ్య శక్తి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఈ ఘటన పై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటని రేవంత్ అడిగారు.