Site icon HashtagU Telugu

TPCC President Revanth Reddy : షర్మిలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. అది అధిష్టానం నిర్ణయమా? రేవంత్ వ్యక్తిగతమా..

TPCC President Revanth Reddy Comments on YS Sharmila

TPCC President Revanth Reddy Comments on YS Sharmila

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్య‌క్షురాలు వై.ఎస్‌. ష‌ర్మిల(YS Sharmila) కాంగ్రెస్(Congress) పార్టీతో పొత్తుతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌న్న‌ ప్ర‌చారం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. ప‌లువురు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేత‌లు సైతం ష‌ర్మిల కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే మంచిదేన‌ని చెప్పుకొచ్చారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) మాత్రం అందుకు భిన్నంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. షర్మిల ఏపీ మనిషి. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికి. షర్మిల వచ్చి తెలంగాణకు నాయకత్వం వహిస్తా అంటే ఉరుకుంటామా? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకు నాయకత్వం వహించరు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌కు పనిచేస్తే స్వాగతిస్తాను. షర్మిల ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ అయితే సహచర పీసీసీ చీఫ్ గా ఆమెని కలుస్తా. నేను పీసీసీ చీఫ్ గా ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదు. షర్మిల తెలంగాణకు నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించ పరచడమే అవుతుంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ వ‌ర్గం నేత‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తున్నాయి. అయితే, రేవంత్ వ్యాఖ్య‌లు ఆయ‌న‌ వ్య‌క్తిగ‌త‌మా? అదిష్టానం నిర్ణ‌యంతో మేర‌కు ఈ వ్యాఖ్య‌లు చేశారా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ష‌ర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో క‌లిపాల‌ని, అలాచేస్తే కాంగ్రెస్‌ పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతోపాటు, ఏపీ కాంగ్రెస్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు రాయ‌బారం న‌డిపిన‌ట్లు ఇటీవ‌ల జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత ప్రియాంక గాంధీ సైతం ష‌ర్మిల‌తో ఈ విష‌యంపై మాట్లాడిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరు వెళ్లి క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ను ష‌ర్మిల క‌లిసిన‌ట్లు స‌మాచారం. అయితే, ష‌ర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పార‌ట‌.

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకైతే ఆలోచిస్తాన‌ని చెప్పిన‌ ష‌ర్మిల, త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధంగా లేద‌ని క్లారిటీగా చెప్పిన‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే, ఏపీకి వెళ్లే విష‌యంపైనా ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌కు క్లారిటీ ఇచ్చార‌ట‌. తాను ఏపీకి వెళ్లేది లేద‌ని, ఏమైనా ఉంటే తెలంగాణ‌లోనే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు అని ష‌ర్మిల స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ష‌ర్మిల‌ను ఏపీ పంపించి.. ఏపీలో పార్టీ ప‌గ్గాలు ఆమెకు అప్ప‌గించాల‌ని భావిస్తోంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ వ‌ర్గ‌నేత‌లు ష‌ర్మిల పార్టీతో పొత్తుపెట్టుకోవాల‌ని కాంగ్రెస్ పెద్ద‌ల‌కు ప‌లుసార్లు సూచ‌న‌లు చేసిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ పెద్ద‌లు అందుకు సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో.. ష‌ర్మిల విష‌యంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌కు క్లారిటీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఇలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

 

Also Read : Mallareddy Dance: డీజే మల్లారెడ్డి, టిల్లు పాటకు డాన్స్ వేసిన మంత్రి!