Site icon HashtagU Telugu

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో.. ఆ రోజే విడుదల.. రేవంత్ రెడ్డి కరెక్ట్ డేట్ పట్టుకున్నాడుగా..

Revanth Reddy Nomination

TPCC President Revanth Reddy announced Congress manifesto released date

తెలంగాణ(Telangana)లో సెప్టెంబర్ 17 చాలా ముఖ్యమైన రోజు. నిజాం(Nizam) పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి లభించి భారతదేశం(India)లో కలిసింది. ఈ రోజుని అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఇటీవల సెలబ్రేట్ చేస్తున్నారు. BRS తెలంగాణ సమైక్యత దినోత్సవం అని, బీజేపీ(BJP) తెలంగాణ విమోచన దినోత్సవం అని గత సంవత్సరం చాలా హంగామా చేశాయి. కాంగ్రెస్(Congress) మాత్రం దీనిని సరిగ్గా వాడుకోలేదనే చెప్పొచ్చు. ఇటీవల కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ తెలంగాణాలో కొత్త ఎత్తుగడలు వేస్తోంది. తెలంగాణ ఇచ్చింది తామే అంటూ, సోనియమ్మ కాంగ్రెస్ ఇచ్చింది అంటూ ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ముఖ్యమైన రోజు సెప్టెంబర్ 17ను ఈ సారి కాంగ్రెస్ కూడా భారీగా చేయబోతుంది.

తాజాగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొని పలు కామెంట్స్ చేసాడు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. అక్టోబర్ 2 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం ముఖ్యమైన సెప్టెంబర్ 17న కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేద్దాం. యూత్ కాంగ్రెస్ కు చెందిన నేతలు ప్రతి నియోజకవర్గంలో ఐదు మంది చొప్పున పని చేయాలి. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి డిసెంబర్ 9న సోనియా జన్మదినం సందర్బంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని అన్నారు.

అయితే ఎప్పుడూ లేనిది ఈ సారి అందరికంటే ముందే రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17ని గుర్తుచేయడమే కాక ఆ రోజు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో రాజకీయాల్లో చర్చగా మారింది. మరి ఈ సారి సెప్టెంబర్ 17న బీజేపీ, BRS కు కాంగ్రెస్ ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు.

 

Also Read : YS Sharmila : అయ్యో ష‌ర్మిల‌.. కేసీఆర్‌, కేటీఆర్‌పై నిత్యం ఘాటు విమ‌ర్శ‌లు.. ప‌ట్టించుకోని బీఆర్ఎస్‌