Site icon HashtagU Telugu

TPCC Manifesto Committee Meeting : గాంధీ భవన్ లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం

Tpcc Manifesto Committee Me

Tpcc Manifesto Committee Me

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా సీఎం రేవంత్ పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన పూర్తి చేసి..తెలంగాణ కు భారీ పెట్టుబడులు తీసుకురాగా..తాజాగా ఈరోజు గాంధీ భవన్ ( Gandhi Bhavan) లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం (TPCC Manifesto Committee meeting) ప్రారంభమైంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశంలో కీలక అంశాల ఫై చర్చిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రజలకు అవసరమైన ఆరు గ్యారెంటీలను ప్రకటించాం..వాటిని 100 రోజుల్లో ప్రజలకు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను నెరవేర్చడం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని తీరుస్తామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి గారు, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మేనిఫెస్టో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also : Five Budgets: దేశాన్ని మార్చిన 5 బడ్జెట్లు ఇవే.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్..!