D Srinivas : డీఎస్ చివరి కోరిక నెరవేర్చిన టీపీసీసీ నేతలు

హైదరాబాద్‌లోని డీఎస్ నివాసానికి వెళ్లి పార్టీ సంద్రాయం ప్రకారం కాంగ్రెస్ జెండాను డీఎస్ పార్థివ దేహంపై కప్పి నివాళులు అర్పించారు టీపీసీసీ నేతలు

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 05:03 PM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (Dharmapuri Srinivas) చివరి కోరికను తీర్చారు టీపీసీసీ నేతలు. గుండెపోటుతో DS ఈరోజు ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఈరోజు తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు.

డీఎస్ మరణ వార్త తెలిసి రాజకీయ పార్టీ నేతలంతా తమ సంతాపం వ్యక్తం చేస్తూ..డీఎస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని డీఎస్ నివాసానికి వెళ్లి పార్టీ సంద్రాయం ప్రకారం కాంగ్రెస్ జెండాను డీఎస్ పార్థివ దేహంపై కప్పి నివాళులు అర్పించారు టీపీసీసీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించిన డీఎస్.. తాను చనిపోతే తన పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలని ఎన్నోసార్లు అనేవారు. ఈ నేపథ్యంలో ఈరోజు పార్టీ నేతలు డీఎస్ భౌతికాయంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి గౌరవించడంతో ఎట్టకేలకు డీఎస్ చిరకాల వాంఛ తీరిందని ఆయన స్నేహితులు, అభిమానులు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో 1948 సెప్టెంబర్ 27న జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ ఎన్‌ఏస్‌యూఐ కార్యకర్తగా చేరి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆర్బీఐలో ఉద్యోగం చేస్తుండగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపుమేరకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. దివంగత నేత అర్గుల్ రాజారాం శిష్యుడిగా నిజామాబాద్ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ చక్రం తిప్పారు. నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1999, 2004లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిల క్యాబినెట్‌లలో పనిచేశారు.1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా డీఎస్ పనిచేశారు.

2004-2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా డీఎస్ పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌గా,వైయస్ రాజశేఖర్ రెడ్డి జోడీగా కలిసి పనిచేశారు. 2004లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రీయాశీలక పాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన ధర్మపురి శ్రీనివాస్ ఓటమి తధానంతరం హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ అకాల మరణం సమయంలో ఎమ్మెల్యేగా లేకపోవడంతో సీఎం పదవి ధర్మపురి శ్రీనివాస్‌కు తృటిలో జారిపోయింది. సోనియా గాంధీకి వీర విధేయుడిగా డీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రణబ్ ముఖర్జీ, తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా డీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మండలి విపక్ష నేతగా డీఎస్ పనిచేశారు.

Read Also : Liquor Policy Case: కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరు పరిచిన సీబీఐ