Bypolls in Telangana: ఇటీవల కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో ఉప ఎన్నికలు ఉండవని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఉప ఎన్నికలు(Bypolls) వచ్చినా కాంగ్రెస్ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ వివాదం తారాస్థాయికి చేరుతుంది. అరికెపూడి గాంధీ ఇంటిని ముట్టడించేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. అంతకుముందు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా నిరసన తెలపడం, పోలీసులు ఎంట్రీ కావడం, సీఎం రేవంత్ రెడ్డి డిజిపికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఒక్కరోజులో జరిగిపోయింది. కాగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లగా సదరు ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ స్పీకర్ కి ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణలోఉప ఎన్నికలపై చర్చ జరుగుతుంది.
Telangana
టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందని, అయితే పరిష్కరించడానికి చట్టపరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.ప్రతిపక్ష రాజకీయాల్లో సమర్థవంతమైన పాత్ర పోషించడంలో బీఆర్‌ఎస్ విఫలమైందని గౌడ్ విమర్శించారు. ప్రజలు బిఆర్‌ఎస్‌కు పార్లమెంటులో సున్నా సీట్లు ఇచ్చారు, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు తమ స్వంత నాయకత్వంపై విశ్వాసం కోల్పోయినందున మా వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్.. ఖర్గే మార్గదర్శకత్వం కోసం తాను వచ్చానని చెప్పారు. అన్ని వర్గాల సభ్యులను కలుపుకొని కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని ఖర్గే చెప్పారన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించడమే లక్ష్యంగా పని చేస్తామని గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా అంతిమ లక్ష్యమన్నారు. మంత్రివర్గ విస్తరణపై స్పందించిన అతను నిర్ణయం ముఖ్యమంత్రి మరియు పార్టీ హైకమాండ్‌దేనని అన్నారు. కొత్త టీపీసీసీ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త కమిటీల నియామకం సర్వసాధారణమని, ఏఐసీసీ నేతలతో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Also Read: Gym at Home : ఇంట్లో వ్యాయామం చేయడానికి ఏ జిమ్ పరికరాలు? నిపుణుల నుండి తెలుసుకోండి..!