Site icon HashtagU Telugu

TPCC:కాంగ్రెస్ కు వ్యూహకర్తలతో పనిలేదు…రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

Revanth Reddy

Revanth Reddy

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ తెలంగాణలో ముందస్తుగానే పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. పొత్తు పొడుపులు, కూటమి రాజకీయాలపై చర్చలు షురూ అయ్యాయి. దేశ రాజకీయాలన్నీ కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వరుసగా భేటీలు పూర్తైనా…పీకే కాంగ్రెస్ లోకి ఎప్పుడు చేరుతున్నరన్న విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం ఖాయం అయినప్పటికీ…ఇంకా అంటూ…ఆ పార్టీ సీనియర్ నేతలు నాన్చుతున్నారు.

ఈనేపథ్యంలో తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ కు వ్యూహకర్తలు అవసరం లేదన్నారు. పార్టీలు నాయకులు తప్ప వ్యూహకర్తలు ఉండరని కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీకే కాంగ్రెస్ లో చేరుతారని..ఏ బాధ్యతలు అప్పగించాలన్నది హైకమాండ్ చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక..ఇతర పార్టీలకు పని చేస్తానంటే కుదరదని..తెలంగాణలో ఓడిపోయే టీఆరెస్ పార్టీతో పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పార్టీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ పీకే వైపు మొగ్గుచూపడం, రాజకీయ వ్యూహకర్తగా కంటే..కాంగ్రెస్ నేతగా కనిపించేందుకు ప్రశాంత్ కిషోర్ ఆరాటపడటంతో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. పీకే రాష్ట్రాల్లో పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈప్రజంటేషన్ లో తెలంగాణకు సంబంధించి కీలక సూచనలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉందని…ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవాలని…ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని ప్రశాంత్ కిషోర్ పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే…టీఆరెస్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. పీకే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరుక్షణం టీఆరెస్ తో ఆయనకున్న బంధానికి తెరపడుతుంది.

Exit mobile version