Revanth on Marri : మర్రి శశిధర్ రెడ్డికి ఎయిడ్స్.. రేవంత్ ఘాటు వ్యాఖ్యలు!

ఒకవైపు అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ను వెంటాడుతుంటే, మరోవైపు నేతల జంపింగ్ లు తీవ్ర తలనొప్పిగా మారాయి.

  • Written By:
  • Updated On - November 28, 2022 / 01:19 AM IST

ఒకవైపు అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ను వెంటాడుతుంటే, మరోవైపు నేతల జంపింగ్ లు తీవ్ర తలనొప్పిగా మారాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వం సమక్షంలో కమలం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. రేవంత్ నిర్ణయాల వల్లనే తాను కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చిందని సీనియర్ నేత విమర్శించారు. బీజేపీలోకి వెళ్తూ కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని ఘాటు వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పీసీసీ చీఫ్ కుర్చి కావాలనుకునేవాళ్లే తనను వ్యతిరేకిస్తున్నారని, కాంగ్రెస్ నాయకలందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వాటి ఫలితాలు వ్యతిరేకంగా వస్తే టీపీసీసీ చీఫ్ ను దోషిగా చూపుతూ బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తాను పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మర్రి శశిధర్ రెడ్డి ఏ ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ తరపున ధర్నాలు, ఆందోళనలు చేసిన దాఖలాలు లేవనీ, తాను మల్కాజీగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ ఏనాడు ప్రచారానికి రాలేదని మండిపడ్డారు.

ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు హైదరాబాద్ లో స్థలాలున్నాయని, వాటి గురించి ప్రశ్నించినందుకే ఆయన బీజేపీలో చేరారని, కోట్లు రూపాయలను కాజేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీ చేయమని అవకాశమిస్తే, మర్రి ఘోరంగా ఓడిపోయారని గుర్తు చేశారు. కన్న తల్లి లాంటి పార్టీకి క్యాన్సర్ సోకిందంటున్న మర్రి శశిధర్ రెడ్డికే ఎయిడ్స్ వచ్చిందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.