Revanth Reddy Comments: నేనే సీఎం.. మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే సీఎం అంటూ మీడియానుద్దేశించి మాట్లాడారు.

  • Written By:
  • Updated On - December 29, 2022 / 10:58 AM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో సీఎం (Next CM) అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో సంక్షోంభం నెలకొన్న విషయం తెలిసిందే. టీకాంగ్రెస్ వార్ పై సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించిన ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొత్త పార్టీ పెడుతారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగింది. వెంటనే రేవంత్ టీం ఈ వార్తలను ఖండించింది.

బుధవారం హైదరాబాద్ లోని ప్రధాన పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో మీడియా ముందుకొచ్చాడు రేవంత్ రెడ్డి. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనపై అసత్య కథనాలు రాయొద్దని మీడియాను కోరారు. భవిష్యత్తులో నేనే సీఎం అవుతానని, జర్నలిస్టులకు అండగా ఉంటానని కూడా రేవంత్ తేల్చి (Revanth Reddy) చెప్పాడు. నా లక్ష్యం మంత్రి పదవి కూడా కాదు అని, టార్గెట్ సీఎం పోస్టు అని రేవంత్ కుండబద్దలు కొట్టారు. ఒకవేళ తాను మంత్రి పదవి ఆశిస్తే ఎప్పుడో జరిగిపోయేదని, గతంలో నేను చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఒకవేళ నేను బీజేపీలో చేరి ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ (Viral) చర్చనీయాంశమవుతున్నాయి.

రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ (Congress MLAs( ఎమ్మెల్యేలకు గట్టి షాకిచ్చారు. పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇద్దరు హాబిచ్యువ‌ల్‌ అఫెండర్ లు( Habitual Offenders) ఉన్నారని.. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్.. టీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వెళ్లాలని చూసిన వాళ్లపై పోరాడుతామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇంప్లీడ్ అయ్యి ఆ 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ (CBI) విచారణ చేయించాలనే దానిపై చర్చ చేస్తున్నామని బాంబు పేల్చారు.

Also Read : KVS Recruitment 2022: కేవీఎస్ లో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!