Revanth Reaction: బీజేపీ గెలుపు కోసమే పార్టీ ఫిరాయింపులు.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్!

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

  • Written By:
  • Updated On - October 17, 2022 / 12:13 PM IST

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ హోమ్ మంత్రులని, మాజీ కేంద్ర మంత్రులను,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కట్టే కాలే వరకు టీడీపీలనే ఉంటా అన్న నేతను కూడా 15 నిమిషాల తర్వాత గులాబీ కండువా కప్పిన అపర చాణక్యుడు చంద్రశేఖర్ రావు అని, మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీరియస్ గా  పనిచేస్తున్న మునుగోడు ఉప ఎన్నిక వేల భువనగిరి పార్లిమెంట్ మాజీ ఎంపీ ను పార్టీ మారుతుంటే ఆపలేక పోయిండా? అని ప్రశ్నించాడు. ఎవరి గెలుపు కోసం కేసిఆర్ పని చేస్తున్నారని,  ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన బిడ్డను కాపాడేందుకు 4 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ మునుగోడు సీటును కేసిఆర్ బీజేపీకి అర్రాస్ పెట్టిండు అని రేవంత్ ఆరోపించారు.

అందుకే బూర నర్సయ్య ను బీజేపీ కి పోయేటట్లు చేసిండు అని, గౌడ సామాజిక వర్గం ఓట్లు 35,000 ఉన్నాయని, బూర పార్టీ మారితే అధికార పార్టీ టీఆర్ఎస్ కు నష్టం అని తెలిసినా కేసిఆర్ ఎందుకు మౌనంగ ఉన్నారని  రేవంత్ ప్రశ్నించారు. కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదు అని, బీజేపీ గెలుపుకు కేసిఆర్ తీవ్రంగా శ్రమిస్తునట్టు అర్ధమైతుందని టీపీసీసీ చీఫ్ అన్నారు. మునుగోడు సీటు బీజేపీ కి ఆర్రాస్ పెట్టిండు అనేదాంట్లో ఎలాంటి డౌట్ లేదు విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుండి కల్వకుంట్ల కవిత భయటపడినట్టేనని, మునుగోడు ప్రజలారా కేసిఆర్, బీజేపికి బుద్ది చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు.