Site icon HashtagU Telugu

Revanth Reddy : బాధితుల పక్షాన నిలవాల్సిన అధికారం దుర్మార్గులకు కొమ్ముకాస్తోంది..!!

Revanth Reddy

Revanth Reddy

జోగులమ్మ గద్వాల జిల్లాలో కలెక్టరేట్ ముందు ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారపార్టీపై దుమ్మెత్తిపోశారు. టీఆర్ఎస్ పాలనలో అందమైన కలెక్టరేట్లు నిర్మించారు కానీ…అక్కడ పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీని ఫలితంగానే బాధితులు ఆర్జీలకు బదులు పెట్రోలు సీసాలతో వస్తున్నారన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన అధికారులు దుర్మార్గులకు కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్యాక్రాంతమైన తన భూమిని కాపాడాలంటూ మానపాడు మండలం కల్కుంట్ల గ్రామానికి చెందిన లోకేష్ 171 సర్వే నెంబర్లోని 5.20గుంటల భూమి తనకు వారసత్వంగా వచ్చింది. ఆ భూమిని లచ్చన్నగౌడ్ అనే వ్యక్తి కబ్జా చేసి తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఈ సమస్యపై లోకశ్ 5ఏళ్లుగా ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసినా బాధితుడికి న్యాయం జరగలేదు. దీంతో మనస్థాపానికి గురైన లోకేష్ సోమవారం నాడు కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న పోలీసులు అడ్డుకుని లోకేష్ ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.