Site icon HashtagU Telugu

Revanth Reddy : టీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ పై రేవంత్ క్లారిటీ

Telangana to k Congress

Kcr And Revanth

అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హేమంత్ వ్యాఖ్యలు దేశంలో వుండే మాతృమూర్తులందరిని అవమానించే విధంగా ఉన్నాయని, దీనిపై ప్రధాని మోడీ, నడ్డా, రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోవడం దారుణమని రేవంత్ తెలిపారు.

హేమంత్ చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా దేశ సంస్కృతికి మచ్చ తెచ్చేలా దిగజారి మాట్లాడాడని, ఇది కేవలం ఒక్క రాహుల్ గాంధీ కుటుంబానికి కాదు 140 కోట్ల భారతీయులకు, మాతృమూర్తులకు జరిగిన అవమానమని రేవంత్ తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తమని చెప్పుకునే ప్రధాని మోడీ అస్సాం ముఖ్యమంత్రి ని బర్త్ రఫ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

కేంద్రం అవినీతి పై కేసీఆర్ దగ్గర సమాచారం ఉంటె ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించిన రేవంత్ బీజేపీ,టీఆరెస్ రెండు తోడు దొంగలేనని స్పష్టం చేసారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు దోచుకుంటున్నారని రేవంత్ అన్నారు. అవినీతి సమాచారం ఉంటే దాయడం కూడా నేరమేనని, కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదని రేవంత్ తెలిపారు.కేసీఆర్ ఒక నమ్మక ద్రోహమని, ఇప్పటికే 2సార్లు కేసీఆర్ నమ్మి మోసపోయామని ఇక గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ ని నమ్మమని రేవంత్ తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నిటికీ కలవవని, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదని తెలిపిన రేవంత్, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు.