Telangana Politics: కాంగ్రెస్ వీడిన వాళ్లంతా వెనక్కి తిరిగి రావాలి: రేవంత్

కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి, బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం, కెసిఆర్ ని గద్దె దించడం కోసం అవసరమైతే తాను ఒక మెట్టు కిందకు దిగేందుకు సిద్ధమని తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Telangana Politics: కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి, బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం, కెసిఆర్ ని గద్దె దించడం కోసం అవసరమైతే తాను ఒక మెట్టు కిందకు దిగేందుకు సిద్ధమని తెలిపారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆ పార్టీ నేతలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. కాగా కర్ణాటక ఫలితాలు తెలంగాలోను రిపీట్ అవ్వబోతున్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్టు కనిపిస్తుంది. కర్ణాటకలో బీజేపీ ఓటమితో తెలంగాణాలో బీజేపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అటు సీఎం కెసిఆర్ సైతం కాసింత వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో, మంత్రులతో అత్యవసర భేటీలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని, తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు గురువారం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అనేక విషయాలపై మాట్లాడారు. కర్ణాటక రిజల్ట్స్ చూసి కెసిఆర్ వణికిపోతున్నారని అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ రెండు ఒకటేనని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడిన మాటలు, కెసిఆర్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఇద్దరు ఒకే గూటి పక్షులు అంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన అందరూ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని వేడుకున్నారు. ఈ విషయంలో తాను ఒక మెట్టు దిగేందుకు రెడీ అన్నారు. నాతో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సీనియర్లతో మాట్లాడుకోవాలని రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నాది కాదని, నేను ఖర్గే నాయకత్వలో పని చేస్తున్నాని రేవంత్ అన్నారు. కెసిఆర్ ని ఓడించడం బీజేపీ వల్ల కాదని, కెసిఆర్ ని గద్దె దించడం కాంగ్రెస్ మాత్రమే చేయగలదని రేవంత్ తెలిపారు. ఈటెల రాజేందర్, రాజగోపాల్, మాజీ ఎంపీ విశ్వేశరరెడ్డి , వివేకా బీజేపీ లోకి వెళ్లినప్పటికీ వాళ్ళని బీజేపీ నమ్మే పరిస్థితుల్లో లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వీళ్ళు కూడా బీజేపీని నమ్మరంటూ వ్యాఖ్యానించారు. దేశానికి, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని నొక్కి చెప్పారు. సోనియా గాంధీ కాంగ్రెస్ ఇవ్వకపోతే కెసిఆర్, ఆయన కుటుంబం రోడ్డు మీద భిక్షమెత్తుకునేది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు రేవంత్. కెసిఆర్ ఇప్పుడు అవతరణ వేడుకలు చేస్తున్నారని, అయితే కెసిఆర్ కు ఇవే చివరి వేడుకలు అని, వచ్చే అవతరణ వేడుకలను జరిపించేది తెలంగాణ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Read More: Mohammed Siraj Dream: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇల్లును చూశారా!