Revanth Emotional: నన్ను ఒంటరిని చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్!

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమోషన్ అయ్యారు. తనను కాంగ్రెస్ పార్టీలో ఒంటరి చేసేందుకు కొందరు కుట్రలు

Published By: HashtagU Telugu Desk
Revanth

Revanth

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమోషన్ అయ్యారు. తనను కాంగ్రెస్ పార్టీలో ఒంటరి చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మీడియాతో కంటతడి పెట్టారు. తనకు పీసీసీ పదవి వచ్చిన తర్వాత కొందరు సీనియర్ నేతలు కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందంటూ ప్రచారం చేయడానికి సొంత నాయకులు ఇతర పార్టీ నాయకులతో కలిసి కుట్ర చేస్తున్నారని అన్నారు. అన్ని నిజాలు త్వరలోనే తెలుస్తాయని రేవంత్ ఎమోషన్ అయ్యారు. తనను అభిమానించే కార్యకర్తలకు మనసులో బాధను చెప్పాల్సి వస్తోంది. ఇది సోనియా గాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమే. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, తన పీసీసీ అధ్యక్ష పదవి కూడా శాశ్వతం కాదని భావోద్వేగానికి గురయ్యారు. నేను పీసీసీ పదవి చేపట్టిన దగ్గర నుంచి టీఆర్ఎస్, బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు.

Also Read:  AP: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్…పోలీస్ రిక్రూట్ మెంట్ కు పచ్చజెండా..!!

కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి పార్టీని కాపాడుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ‘‘తూటాలకైనా తుపాకి గుండ్లకైనా నేను సిద్ధం! ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం పని చేస్తా! కాంగ్రెస్ని బ్రతికించుకుందాం! మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం దివిసీమలా మన రాష్ట్రం కాకూడదు’’ అంటూ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా సర్కిల్ లో వైరల్ గా మారింది.

Also Read:

  Last Updated: 21 Oct 2022, 01:15 PM IST