రేవంత్ దూకుడు.. టీఆర్ఎస్ కు ముచ్చెమ‌ట‌లు..!

ఎక్క‌డైతే స‌మ‌ర్థ‌వంతమైన నాయ‌క‌త్వం ఉంటుందో, అక్కడ మాత్ర‌మే విజ‌యం ఉంటుంది. ఈ మాటలు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి అతికిన‌ట్టుగా స‌రిపోతాయి.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:35 PM IST

ఎక్క‌డైతే స‌మ‌ర్థ‌వంతమైన నాయ‌క‌త్వం ఉంటుందో, అక్కడ మాత్ర‌మే విజ‌యం ఉంటుంది. ఈ మాటలు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి అతికిన‌ట్టుగా స‌రిపోతాయి. ఇంతింతై అన్న‌ట్టుగా జ‌డ్పీటీసీగా మొద‌లైన ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం తెలంగాణ కాంగ్రెస్ పీఠందాకా చేరింది. టీపీసీసీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచే రేవంత్ జ‌ట్‌ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఒక‌వైపు పార్టీ బ‌లోపేతానికి పనిచేస్తూనే.. మ‌రోవైపు సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌ను ఒకే తాటిపైకి తీసుకురావడంలో స‌కెస్ అయ్యారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ ను తిరిగి అధికారంలో తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకుస‌సాగుతున్నారు. పార్టీలో సీనియ‌ర్ నేత‌లైన జానా, భ‌ట్టి, గీతారెడ్డి లాంటివాళ్ల‌తో క‌లిసిపోతూ, వాళ్ల‌ను పార్టీ కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం క‌ల్పిస్తూ త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే రేవంత్ రెడ్డికి ముందు, రేవంత్ రెడ్డికి త‌ర్వాత అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన త‌ర్వాత ఒక్కసారిగా ఉనికిని కోల్పోయింది. పార్టీని న‌డిపించే స‌రైన లీడ‌ర్ లేక క్యాడ‌ర్ నిస్తేజంగా మారింది. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టారో.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం రెట్టింపైంది. కేసీఆర్ నిరంకుశ పాల‌న రేవంత్ రెడ్డితోనే అంత‌మ‌వుతుంద‌ని అటు కార్య‌క‌ర్త‌లు, ఇటు తెలంగాణ‌ నిరుద్యోదులు భావించారు. అందుకే రేవంత్ ఏ పిలుపునిచ్చానా చురుగ్గా పాల్గొంటున్నారు. మొన్న ఇంద్ర‌వెల్లి స‌భ అయినా, నిన్న కేసీఆర్ అడ్డా అయిన‌ గ‌జ్వేల్ లో అయినా కార్య‌క‌ర్త‌లు పొటెత్తి విజ‌య‌వంతం చేశారు.

రేవంత్ రెడ్డి దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా, కాంగ్రెస్ శ్రేణుల‌కు సైతం దూకుడు స్వ‌భావం నేర్పిస్త్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ ఆక‌ర్ష్ పేరుతో వివిధ పార్టీల నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకున్నారు. త‌న‌పైనే కానీ, పార్టీ పైనా కానీ ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు చేస‌స్తే రేవంత్ ఏమాత్రం స‌హించ‌డం లేదు. ఇప్ప‌టికే మంత్రి మ‌ల్లారెడ్డి భూబాగోతం ఆధారాల‌తో స‌హ‌ బయ‌ట‌పెట్ట‌గా.. రీసెంట్ గా వైట్ చాలెంజ్ పేరుతో కేటీఆర్ కు స‌వాలు విసిరి అధికార పార్టీ నేత‌ల‌కు కినుకులేకుండా చేశారు. ఏ చిన్న అవ‌కాశ‌మొచ్చిన కేసీఆర్ పాల‌న‌ను ఎండ‌గ‌డుతూ టీఆర్ఎస్ నేత‌ల‌కు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి భార‌త్ బంద్ లో పాల్గొని మరోసారి అధికార పార్టీపై విరుచుకుప‌డ్డారు. సాగు చ‌ట్టాల‌కు ఉద్యమానికి తొలుత మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం మారుమాటైనా మాట్లాడడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిర్వహించిన బంద్ లలో కేటీఆర్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని మండిపడ్డారు.