English Medium: ఇంగ్లీష్ మీడియంలో ‘తెంగ్లిష్’

ఏమాత్రం ముందు చూపు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా వైపు పరుగు పెడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో 2008లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన స్కూల్స్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - January 23, 2022 / 10:11 AM IST

ఏమాత్రం ముందు చూపు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా వైపు పరుగు పెడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో 2008లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన స్కూల్స్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు తెలంగాణలోని 625 స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. వాటికి సక్సెస్ స్కూల్స్ అని పేరు పెట్టారు. కానీ, అక్కడి టీచర్స్ మాత్రం తెలుగు మీడియం లో చెప్పిన నైపుణ్యంతో ఇంగ్లీష్ లో బోధన చేయలేక పోతున్నారు. ఇదే విషయాన్ని ఆనాడు 2009 లో ఎమ్మెల్సీ గా ఉన్న ప్రొఫిసర్ నాగేశ్వర్ మండలిలో ప్రశ్నించాడు. కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. మళ్ళీ ఇప్పుడు టీచర్స్ ను ట్రైన్ చేయకుండా ఇంగ్లీష్ మీడియం వచ్చే ఏడాది నుంచి పెడతామని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ఇలాగే ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. మండల, జిల్లాపరిషత్ స్కూల్స్ అన్నింటిలో పెట్టింది. దానిపై కోర్టులో కేస్ నడుస్తుంది. ప్రస్తుతం సుప్రీమ్ కోర్టులో వివాదం ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ ఇంగ్లీష్ మీడియం బోధన సరైన విధంగా జరగటం లేదు.
తెలంగాణ ప్రభుత్వం తెలుగు ఒక సబ్జెక్ట్ గా ప్రతి ఒక్కరు ఐదో తరగతి వరకు చదవాలని నిర్ణయించింది. మిగిలిన సబ్జెక్టులు అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో లేదు. ఆ కారణం గా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో పేరెంట్స్ చేరుస్తున్నారు. ఇదే ప్రభుత్వ స్కూల్స్ మూతకు ప్రధాన కారణంగా ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని జీవో ఇచ్చింది.
ప్రస్తుతం సుమారు 35 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వాటిని ఏడేళ్ల నుంచి కేసీఆర్ భర్తీ చేయలేదు. స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు చాలా చోట్ల లేవు. ప్రస్తుతం పని చేస్తున్న టీచర్స్ ఇంగ్లీష్ మీడియం బోధన చేయడం చాలా కష్టం. ఇలాంటి ఛాలెంజ్ ల మధ్య తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం విమర్శలకు తావిస్తోంది.
ఒక వేళ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ తెలుగును మైండ్ లో పెట్టుకుని ఇంగ్లీష్ చెప్పాలని చూస్తారు. దీన్నే సెటైర్ గా తెంగ్లీష్ గా విపక్షాలు కామెంట్ చేయడం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నిజమైన ఇంగ్లీష్ బోధన చేసే అవకాశం లేదని నిపుణుల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న 35 వేల టీచర్ పోస్టులను ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో భర్తీ చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడున్న టీచర్స్ కు ట్రైనింగ్ తో పాటు పరీక్ష పెట్టడం ద్వార నియామకాలు చేస్తే సరి.

లేదంటే పేరుకు ఇంగ్లీష్ మీడియం నిజ రూపంలో జరిగేది తెలుగు మీడియం అవుతుంది. ఫలితంగా అటు ఇంగ్లీష్ ఇటు తెలుగు మీడియం కు కాకుండా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. సో..లండన్ తరహా విద్యను అందిస్తా అని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో తెలుగు మాతృభాష లో ఉన్నామని గుర్తించాలి. లేదంటే లండన్, తెలంగాణ మీడియం మధ్య సమాజం నలిగిపోవడం ఖాయం.