Site icon HashtagU Telugu

7 Foot Conductor: 7 అడుగుల బస్ కండక్టర్‌కు ఊరట.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

7 Foot Bus Conductor Tsrtc Bus Telangana Govt Cm Revanth Reddy

7 Foot Conductor: 7 అడుగుల బస్సు కండక్టర్ అమీన్‌ అహ్మద్‌ అన్సారీకి భారీ ఊరట లభించింది. బస్సు కండక్టర్‌గా పనిచేసే క్రమంలో హైట్ వల్ల ఆయన ఎదుర్కొంటున్న సమస్యలపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అమీన్‌కు ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సీఎం సూచించారు. ఈవిషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. త్వరలోనే అమీన్ అహ్మద్‌ అన్సారీని సజ్జనార్ వేరే డిపార్ట్‌మెంటుకు  బదిలీ చేస్తారని పొన్నం చెప్పారు.

Also Read :Prudent Electoral Trust: బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రుడెంట్ ట్రస్ట్ రూ.880 కోట్ల విరాళాలు.. ఇది ఎవరిది ?

తండ్రి చనిపోవడంతో అమీన్‌కు జాబ్

అమీన్‌ అహ్మద్‌ అన్సారీ.. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని షాహీనగర్‌  వాస్తవ్యుడు. అమీన్ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. ఆయన అనారోగ్యం కారణంగా 2021లో చనిపోయారు. అమీన్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దీంతో కారుణ్య నియామకం కింద అమీన్‌కు మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా జాబ్ ఇచ్చారు. అయితే ఆయన 7 అడుగుల పొడవు ఉండటంతో బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వర్తించడం సవాల్‌గా మారింది.

Also Read :Mary Kom Divorce: మేరీ కోమ్ విడాకులు.. మరో వ్యక్తితో లవ్.. ఎందుకు ?

మెడనొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి సమస్యలతో.. 

అమీన్(7 Foot Conductor) డ్యూటీలో ఉన్నంతసేపు మెడను పక్కకు వంచి.. బస్సులో తిరుగుతూ టికెట్లు ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల ఆయనకు మెడనొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయి. బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10గంటల పాటు అమీన్ ప్రయాణించాల్సి వస్తోంది. ఇటీవలే ఈ అంశంపై మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. వాటిని చూసి సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అమీన్ హైట్‌కు తగిన మరేదైనా జాబ్‌ను ఆర్టీసీలో సజ్జనార్ సర్దుబాటు చేస్తారని సమాచారం. త్వరలోనే ఈ దిశగా ఏర్పాట్లు జరుగుతాయని అమీన్, ఆయన కుటుంబీకులు ఆశిస్తున్నారు.

Also Read :Hajj 2025 : భారత్, పాక్, బంగ్లా‌లకు సౌదీ షాక్.. అమల్లోకి వీసా బ్యాన్