Site icon HashtagU Telugu

Hyderabad: నగరంలో భారీగా తగ్గిన టమోటా ధరలు

Hyderabad

New Web Story Copy (32)

Hyderabad: భారీ వర్షాల కారణంగా టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. కిలో రూ.200 పైగా అమ్మకాలు జరిగాయి. కావాల్సిన మేర నిల్వ లేకపోవడంతో ఉన్న టమోటా నిల్వ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ఇదే అదునుగా కొందరు దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు జరిపి దళారులు అధిక ధరలకు విక్రయించారు.

గత నెల రోజులుగా టమోటా ధరలు కిలో 70 నుంచి 200 వరకు అమ్మకాలు చేపట్టారు. హైదరాబాద్ విషయానికి వస్తే టమోటా ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.200 వరకు ఉన్న ధరలు తాజాగా రూ.60-70కి పడిపోయాయి. నిన్న రిటైల్ మార్కెట్‌లో ధరలు మరింత దిగజారి కిలో రూ.50-60కి చేరుకున్నాయి. ధరలు పెరగడంతో నగర ప్రజలు టమోటాను కొనడమే మానేశారు. దీంతో టమోటా అమ్మకదారులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండే పంట కాకపోవడంతో కుళ్లిపోతున్నాయి . దీంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని ఇతర జిల్లాలలో టమోటా పంటకు భారీ నష్టం వాటిల్లడంతో నగరంలో టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి, ధరల పెరుగుదల కారణంగా అనేక రెస్టారెంట్లు మరియు హోటల్స్ టమోటా వాడకాన్ని తగ్గించడం ప్రారంభించాయి. దీంతో టమోటా ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

Also Read: Eelection Meetings : స‌భ‌ల సంద‌డి! 23న కేసీఆర్, 25న ఖ‌ర్గే, 28న అమిత్ షా