Tomato in Warangal Market : టమాటా.. ఇప్పుడు ఈ పేరు వింటే సామాన్యుల గుండెలు గుబేల్ అంటున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా టమాటా ధర పెరిగింది. నెలన్నర క్రితం వరకు కేజీ. 15 నుండి రూ.20 లు పలికిన టమాటా.. నెల రోజులుగా కేజీ ₹.150/- పలుకుతుంది. దీంతో సామాన్యులు టమాటా వైపు చూడడమే కాదు ఆ పేరు విన్న కానీ వామ్మో అంటున్నారు. ఇక టమాటా (Tomato) సాగు చేసిన రైతులు మాత్రం ఈ నెల రోజుల్లోనే కోటీశ్వరులు అయ్యారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని చూసిన కొంతమంది వ్యాపారస్తులు మాత్రం కన్నీరు పెట్టుకొని , కొనుగోలు చేసిన టమాటాను చెత్తలో వేసి వెళ్లిపోయారు. ఈ ఘటన వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ లో చోటుచేసుకుంది.
గత నాల్గు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాల రహదారులు తెగిపోయి రవాణా వ్యవస్థ స్థంభించింది. అలాగే పలు పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యముగా టమాటా పంట. టమాటా (Tomato) కు గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతుండడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని వరంగల్ కు చెందిన కొంతమంది వ్యాపారస్తులు మదనపల్లి, కర్ణాటక మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున టమోటాలు తెప్పించారు.
కానీ రాష్ట్రవ్యాప్తంగా మూడు, నాల్గు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. పైగా అధిక ధరల కారణంగా సామాన్యులు టమాటా (Tomato) కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో టమోటాలు పెద్ద ఎత్తున కుళ్లిపోయాయి. దీంతో చేసేదేమీ లేక అవన్నీ తీసుకొచ్చి చెత్తకుండీలో పడేశారు. భారీ పెట్టుబడితో తెచ్చిన టమోటాలు వర్షం కారణంగా ఒక్కరోజులోనే దెబ్బతిన్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : CM Jagan : వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్