Tollywood Hails KCR: కేసీఆర్ నిర్ణయంపై సమంత, నాని, ప్రకాష్ రాజ్, రామ్ రియాక్షన్

మోదీ తీసుకువచ్చిన రైతు చట్టాలకి వ్యతిరేకంగా సంవత్సరం నుండి రైతులు పోరాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 21, 2021 / 11:33 PM IST

మోదీ తీసుకువచ్చిన రైతు చట్టాలకి వ్యతిరేకంగా సంవత్సరం నుండి రైతులు పోరాడుతున్నారు. రైతుల పోరాటానికి తలొగ్గిన మోదీ ఆ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. రైతులకు క్షమాపణ చెప్తున్నానని తెలిపారు.దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదని, ఆ పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలను కేంద్రమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతుల పోరాటంలో అసువులుబాసిన ప్రతి రైతు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మూడు లక్షలు ఇస్తున్నామని ప్రకటించారు.

Also Read: రేవంత్ కు పదవీ గండం?

రైతుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీతారలు సమంత, ప్రకాశ్‌ రాజ్‌, నాని, రామ్‌ తదితరులు కేసీఆర్ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయం మంచిదని,అన్నదాతల కుటుంబాలకు ఈ సాయం ఉపయోగపడుతుందని అన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని నటి సమంత, హీరో నాని స్వాగతించారు.

కేసీఆర్ నిర్ణయానికి సంబందించిన పోస్ట్ కింద ప్రియమైన ప్రధాని మోదీ గారూ, క్షమాపణలు ఒక్కటే సరిపోవు. ఆ రైతుల కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా? అని నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

Also Read: అమరావతి జోష్..షా ఎత్తుగడ.!

సాగు చట్టాల వల్ల కలిగే ఇబ్బందులను పక్కనపెడితే, అన్నదాతల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులపై ఆయనకున్న ప్రేమ తెలియజేస్తోందని టాలీవుడ్ నటుడు రామ్‌ ట్వీట్‌ చేశారు.