Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో, ఏపీలోని 7 జిల్లాల్లో ఇవాళ వానలు

Rain  Alert Today : ఇవాళ తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు.

  • Written By:
  • Updated On - July 25, 2023 / 07:10 AM IST

Rain  Alert Today : ఇవాళ తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. రేపు (జూలై 26న) జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని(Rain Alert Today)  హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిందన్నారు.

Also read : Vastu Tips: ఇంట్లో ఈ మొక్కను పెంచితే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?

ఏపీలోని 7 జిల్లాల్లో ఇవాళ.. 

ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలో రేపటి (జూలై 26) నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాటికి ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తర్వాత అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది.

Also read : Jio Tag : పోయిన వస్తువులు దొరకబట్టే జియో ట్యాగ్.. స్పెషల్ ఆఫర్ కూడా ఉంది.. ఎలా పనిచేస్తుందంటే…