BJP Today : ఇవాళ ప్రధాని మోడీ, అమిత్‌షా, యోగి ప్రచార హోరు

BJP Today : తెలంగాణ అసెంబ్లీ పోల్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు శనివారం నుంచే ప్రచారాన్ని ఉధృతం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Bjp Today

Bjp Today

BJP Today : తెలంగాణ అసెంబ్లీ పోల్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు శనివారం నుంచే ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల తరఫున వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస చేశారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తూఫ్రాన్‌లో, మధ్యాహ్నం 1.30 గంటలకు నిర్మల్‌లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం తిరుపతికి వెళ్ళనున్న ప్రధానమంత్రి.. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని మోడీ దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరుపతి నుంచి నేరుగా మహబూబాబాద్‌‌కు ప్రధానమంత్రి చేరుకుంటారు. మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని మోడీ  రోడ్ షో నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

అమిత్‌షా, యోగి ప్రచారభేరి.. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ (ఆదివారం) ఉదయం 11.15 గంటలకు మక్తల్ నియోజకవర్గంలో, మధ్యాహ్నం 1 గంటలకు మునుగోడు నియోజకవర్గంలో, 3.45 గంటలకు భువనగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కూకట్‌పల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అమిత్‌షాతో కలిసి ప్రచారం చేస్తారని తెలిసింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఈనెల 28తో తెరపడనుంది. దీంతో అన్ని పార్టీల అగ్రనేతలు తెలంగాణపైనే ఫోకస్ పెట్టారు. మిగిలిన రెండు రోజుల టైంలో సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని టార్గెట్‌గా(BJP Today)  పెట్టుకున్నారు.

Also Read: 41 Workers – 15 Days : 15వ రోజూ టన్నెల్‌లోనే 41 మంది.. ‘ప్లాన్ బీ’ రెడీ.. ఏమిటది ?

  Last Updated: 26 Nov 2023, 09:10 AM IST