BJP : నేడు ఇందిరా పార్క్‌ వద్ద బీజేపీ ధర్నా..పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..

BJP : ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Today, Kishan Reddy and Bandi Sanjay will participate in the BJP dharna at Indira Park.

Today, Kishan Reddy and Bandi Sanjay will participate in the BJP dharna at Indira Park.

BJP Maha Dharna :  నేడు ఇందిరా పార్క్‌ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టనుంది. ఈ మేరకు మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. బాధితులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మూసీ బాధితులు తదితరులు పాల్గొననున్నారు.

అలాగే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీజేపీ తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ రూ.2 లక్షలు రుణ మాఫీ పూర్తిగా అమలయ్యే వరకు వదలబోమన్నారు. బీఆర్‌ఎస్‌ తరహాలో మోసాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. లక్ష మంది రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రూ.2 లక్షల రుణమాఫీపై ఎందుకు ఆంక్షలు ఎందుకు విధించారని? ప్రశ్నించింది. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను దారుణంగా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ పై ధర్నా చేపట్టనుంది.

Read Also: Ladakh : తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ మొదలు..

  Last Updated: 25 Oct 2024, 10:25 AM IST