Site icon HashtagU Telugu

Telangana Cabinet : మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నాయా…?

T Congress Minsters

T Congress Minsters

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం(Telangana Cabinet)లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కొత్తగా నియమించబోయే మంత్రులకు శాఖల కేటాయింపు, అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమందికి శాఖల మార్పు(Ministers Posts Change)లపై కూడా చర్చించినట్టు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇది పెద్ద మార్పుల‌కు సంకేతంగా భావిస్తున్నారు.

Sakshi Office : ఏలూరు లో ‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు

ఈ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఆయన కూడా వెంటనే ఢిల్లీకి బయలుదేరడం, ఆయనకు ఇచ్చిన శాఖల్లో మార్పులేనా? లేక ఇంకేదైనా కీలక బాధ్యతల విషయమా? అనే అనుమానాలకు దారి తీసింది. ఇప్పటివరకు మంత్రివర్గంలో జరిగిన పరిమిత మార్పులు, కొంతమంది నేతల అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు జరుగుతున్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి.

Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!!

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలవడం, రేవంత్ హైకమాండ్‌కు వరుసగా నివేదికలు పంపుతున్నట్టు సమాచారం రావడం దానికే బలమిచ్చాయి. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర పాలనపై దగ్గర నుంచి దృష్టి పెట్టిన నేపథ్యంలో, పనితీరు ఆధారంగా శాఖల బదిలీలు జరిగే అవకాశముందని అంచనా. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.