Site icon HashtagU Telugu

TS TNGO : బండి సంజయ్ వ్యాఖ్యలకు భగ్గుమన్న టీఎన్జీవో నేతలు…నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు..!!

Telangana BJP

Sanjay bandi

టీఎన్జీవో నేతలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రమోషన్లు, పైరవీల కోసం టీఎన్జీవో నేతలు అమ్ముడుపోయారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వీరంతా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. 317జీవో పేరుతో మిమ్మల్ని విడదీసినందుకా మీరు అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. టీఎన్జీవో నేతలపై కేసులు పెట్టాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఎన్జీవో నేతలు భగ్గుమన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.

కాగా ఆదివారం మునుగోడులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్…హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ప్రస్తావించే వరకు జీవో 51జారీ చేసిన సంగతి తనకు తెలియదన్నారు. జీవో జారీ చేసిన తర్వాత ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదంటూ కేసీఆను ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తుకు కేసీఆర్ ఎందుకు భయపడతున్నారంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.