Site icon HashtagU Telugu

Tirupati Reddy : హైడ్రా నోటీసులపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి రియాక్షన్..

Hydraa Tirupathi

Hydraa Tirupathi

హైడ్రా నోటీసులు జారీ చేయడంపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి (CM Revanth Reddy brother Tirupati Reddy) స్పందించారు. ‘2015లో అమరాసొసైటీలో నివాసం కొన్నా. కొనుగోలు సమయంలో FTLలో ఉందనే సమాచారం లేదు. FTLలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది.

We’re now on WhatsApp. Click to Join.

హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా ఈరోజు దుర్గం చెరువు పరిధిలో వందల ఇళ్లకు నోటీసులు జారీ చేసారు. వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద నోటీసులు జారీ చేసి, యజమానులు కూల్చకుంటే ఓకే.. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు.

కేవలం సామాన్య ప్రజలేకే కాదు స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి సైతం నోటీసులను జారీ చేయడం తో చట్టం ముందు అంత సమానమే అని రేవంత్ చెప్పకనే చెపుతున్నారని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : kavitha : కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత