Tihar Jail : తీహార్ జైలులో కల్వకుంట్ల కవిత.. ఈ జైలు విశేషాలివీ

  • Written By:
  • Updated On - March 27, 2024 / 09:53 AM IST

Tihar Jail : తీహార్ జైలు.. ఇప్పుడు అంతటా వినిపిస్తున్న పేరు ఇది. తాజాగా మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితురాలు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం తీహార్ జైలుకే తరలించారు. జైలు గదిలో(Tihar Jail) కవిత  మంచం, పరుపు, బట్టలు, చెప్పులు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది.

We’re now on WhatsApp. Click to Join

తీహార్ జైలు గురించి ఆసక్తికరమైన విషయాలు

1. ఢిల్లీ జైళ్ల శాఖ, ఢిల్లీ ప్రభుత్వం కలిసి సంయక్తంగా తీహార్ జైలును మెయింటైన్ చేస్తుంటాయి. ఈ జైలు క్యాంపస్‌లో 9 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి.

2. తీహార్ జైలు.. దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు.

3. గతంలో ఎంతోమంది మాజీ కేంద్రమంత్రులు, మాజీ సీఎంలు, మాజీ రాష్ట్ర మంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, బడా స్మగ్లర్లు, బడా గ్యాంగ్ స్టర్లు వివిధ కేసుల విచారణ సందర్భంగా తీహార్ జైలులోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది.

4. తీహార్ జైలు సామర్థ్యం 6500 మంది ఖైదీలు. కానీ ప్రస్తుతం ఈ జైలులో దాదాపు 10,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారని సమాచారం.

Also Read : Indian Crew : బ్రిడ్జి కూలడానికి కారణమైన నౌకలో 22 మంది భారతీయులు

5. TJ’s అనేది తీహార్ జైలుకు చెందిన ఒక ప్రత్యేకమైన బ్రాండ్.   ఈ బ్రాండ్ పేరుతో తీహార్ జైలులోని ఖైదీలు సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ పౌడర్లు, స్నాక్స్, కుకీస్, పచ్చళ్లు, మసాలాలు తయారు చేస్తుంటారు.

6. గతంలో చోరీకి పాల్పడి తీహార్ జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలు.. జైలులోపల 10 అడుగుల సొరంగం తవ్వారు. ఆ సొరంగ మార్గం నుంచి తప్పించుకోవాలని డిసైడయ్యారు. అయితే తప్పించుకునే క్రమంలో ఒకరు దొరికిపోగా, మరో వ్యక్తి ఎలాగోలా బయటపడ్డాడు.

7. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ ఇక్కడే ఉన్నాడు. అతను 1986 సంవత్సరంలో ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆ తర్వాత మళ్లీ అతన్ని పట్టుకున్నారు.

8. తీహార్ జైలుకు కిరణ్ బేడీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు.. ఖైదీలు, సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించారు.

9. తీహార్ జైలులో ఉన్న విక్రమ్ సింహ్ అనే ఖైదీ 2018 సంవత్సరంలో ఐఏఎస్ ఎగ్జామ్‌లోనూ పాసై అందరి చేత ఔరా అనిపించుకున్నాడు.

Also Read :GT Vs CSK: చెపాక్ లో చెన్నై ధనాధన్… గుజరాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ