Site icon HashtagU Telugu

Revanth Reddy House : రేవంత్ రెడ్డి ఇంటివద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

Revanth House

Revanth House

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో హైదరాబాద్ (Hyderabad) లోని ఆయన ఇంటివద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు పోలీసులు. రేవంత్‌రెడ్డి చాలా ఏళ్లుగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 44లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి అక్కడే ఉండాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. సమీపంలోని 44ఎ రోడ్డులోనే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అక్కడే కొన్ని రోజులు ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని పోలీసులకు సూచనప్రాయ సమాచారం అందింది. అందుకు అనుగుణంగా మంగళవారం రాత్రి పోలీసులు బందోబస్తు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రస్తుతం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుదీకరణ, రహదారుల శుభ్రత, ఇతర పనులు పూర్తిచేసే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్లటూన్ల బలగాలను విధుల్లో ఉంచాం. బుధవారం నుంచి వారికి అదనంగా సాయుధ సిబ్బంది, స్థానిక పోలీసులు అంచెలంచెలుగా విధుల్లో ఉంటారు’ అని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే రేవంత్‌రెడ్డి నివాసానికి సమీపంలో పెద్దమ్మ గుడి, ఓ సినీ నటుడి నివాసం ఉంది. ఆలయం వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటిపై రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు సమీక్షించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రేవంత్ ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. రేపు LB స్టేడియం లో రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read Also : LB స్టేడియం లో రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం