Bonalu : బోనాల సంద‌ర్భంగా పాత‌బ‌స్తీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేసిన పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీలో నేడు, రేపు బోనాల జాత‌ర జ‌ర‌గ‌నుంది. బోనాల పండుగ సంద‌ర్భంగా పాత‌బ‌స్తీలో భారీ భ‌ద్ర‌త‌ను

Published By: HashtagU Telugu Desk
Lashkar Bonalu

Lashkar Bonalu

హైదరాబాద్ పాతబస్తీలో నేడు, రేపు బోనాల జాత‌ర జ‌ర‌గ‌నుంది. బోనాల పండుగ సంద‌ర్భంగా పాత‌బ‌స్తీలో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. నేడు (ఆదివారం) ఉత్సవాలు, సోమవారం ఊరేగింపులు సజావుగా జరిగేలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ జోన్) పి సాయి చైతన్య తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులు, స్థానిక పోలీసు సిబ్బందిని మోహరించారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఉన్నతాధికారులను నియమించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులను ముందుగానే ప్రకటించారు. ప్రజలందరూ ఉత్స‌వాలు స‌జావుగా సాగేందుకు సహకరించాలని డీసీపీ సాయి చైతన్య కోరారు. పాతబస్తీలోని ముఖ్యమైన ఆలయాల్లో బోనాల పండుగ సందర్భంగా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, ఇతర ఆలయాలు ఈ వేడుక కోసం అలంకరించబడ్డాయి. రాజకీయ నాయకులు, సినీ నటులు, ఐఏఎస్‌, ఐసీఎస్ అధికారుల‌తో సహా పలువురు వీఐపీలు ఆదివారం పాతబస్తీలోని దేవాలయాలను సందర్శించి నైవేద్యాలు సమర్పించనున్నారు.

  Last Updated: 16 Jul 2023, 07:53 AM IST