Site icon HashtagU Telugu

Khammam : ఖ‌మ్మంలో కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీపీ

Telangana Polls (1)

Telangana Polls (1)

రేపు (డిసెంబరు 3న) తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఖ‌మ్మంజిల్లాలో స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామ‌ని పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎం) స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉంచారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, పోలీసు అధికారులకు సీపీ విష్ణు వారియ‌ర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ ఉన్న సమగ్ర మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద కేంద్ర బలగాలు, సాయుధ సిబ్బంద, జిల్లా పోలీసులు ప‌హారా కాస్తున్నార‌ని తెలిపారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి అగ్నిమాపక యంత్రాలను కూడా సిద్దంగా ఉంచామ‌ని తెలిపారు. కౌంటిగ్ ప‌క్రియ స‌జావుగా సాగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ తెలిపారు. వివిధ పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌కు స‌హ‌కరించాల‌ని కోరారు.