తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ముత్తునూర్, గిన్నెర గ్రామాల మధ్య రాత్రి 11 గంటలకు ఇద్దరు వ్యక్తులు పులిని చూశారు. పులి అభయారణ్యం నుంచి ఏజెన్సీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు కూడా అనుమానిస్తున్నారు. గతంలో పశువులపై కూడా పులి దాడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు పులి కదలికలతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని కోరారు. వెంటనే అడవి పులిని పట్టుకోవాలని అటవీశాఖాధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
Indravelli Tiger: ఇంద్రవెల్లిలో పెద్ద పులి గర్జన

Image of tiger in a forest area used for representational purpose