Telangana Congress : కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి..ఢిల్లీ కి పొంగులేటి

ఓ పక్క అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించి గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే..కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించకుండా సైలెంట్ గా ఉండడం ఫై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) సీట్ల పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు

Published By: HashtagU Telugu Desk
Tickets Issue In Telangana

Tickets Issue In Telangana

నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election Date ) జరగబోతున్నాయి. అంటే పట్టుమని రెండు నెలలు కూడా లేదు. ఈ సమయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో లోల్లులు చల్లారడం లేదు. ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే అంతే సంగతి..ఆ పార్టీ లో ఎప్పుడు ఏ నేత అలకపాన్పు ఎక్కుతారో అర్ధం కాదు..నిత్యం కాంగ్రెస్ లో పంచాయితీలు నడుస్తాయని..ఆ పార్టీ లో అసలు సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదని..అలాంటి పార్టీ కి ఓటు వేసి మీ జీవితాలు ఆగం చేసుకోవద్దంటూ బిఆర్ఎస్ నేతలు ప్రసంగిస్తుంటే..ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారు.

ముందు ప్రజలను గెలుచుకోవాలనే ఆలోచన ఎవరికీ రావడం లేదు. ఎంతసేపు సీట్ల పంచాయితీ, టిక్కెట్ల పంచాయితీ తప్ప మరోటి కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఓ పక్క అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించి గ్రామాల్లో ప్రచారం చేస్తుంటే..కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించకుండా సైలెంట్ గా ఉండడం ఫై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) సీట్ల పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బీసీ నేతలు, ఓయూ విద్యార్థులు, మహిళా నేతలు తమకు తగిన సంఖ్యలో సీట్లను కేటాయించాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది ముఖ్య నేతలు తమతో పాటు అనుచరులకు కూడా టికెట్లు ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Khammam Ex MP Ponguleti Srinivas Reddy) కూడా తన వర్గానికి చెందిన 15 మందికి టికెట్ల ఇవ్వాలంటూ ఈ రోజు అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా తాను ప్రతిపాదించిన 15 స్థానాల అభ్యర్థిత్వంపై చివరిసారిగా పొంగులేటి ఈ రోజు చర్చించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరు స్థానాలకు తాను ప్రతిపాదించిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని పొంగులేటి కోరనున్నట్లు తెలుస్తోంది. మరి పొంగులేటి అభ్యర్థన మేరకు టికెట్స్ ఇస్తారా..లేదా..? త్వరగా ఈ టిక్కెట్ల పంచాయితీ పక్కకు పెట్టి ప్రచారం మొదలుపెడతారా లేదా అనేది చూడాలి.

Read Also : Jonnagiri Gold Mine : దేశంలోనే తొలిసారిగా మన జొన్నగిరిలో ప్రైవేట్ గోల్డ్ మైన్

  Last Updated: 09 Oct 2023, 02:03 PM IST