Site icon HashtagU Telugu

Thummala Vs Puvvada Ajay : తుమ్మల – పువ్వాడ ల మధ్య ముదురుతున్న మాటలు

Thummala Puvvada War

Thummala Puvvada War

ఖమ్మం (Khammam)లో బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) మధ్య మాటలు బాంబుల్లా పేలుతున్నాయి. తుమ్మల – పువ్వాడ (Thummala Vs Puvvada Ajay) ఇద్దరు ఎక్కడ తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తుమ్మల చెల్లని నాణెం అని..నేను రూ.100 నాణెం అని పువ్వాడ వ్యాఖ్యానిస్తే.. ‘‘నేను చెల్లని రూపాయి కాదు డాలర్…..ఎక్కడైనా చెల్లుతా. డాలర్ కి ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువ. నీవు రద్దైన రెండు వేల నోటు నీ విలువ అది’’ అంటూ తుమ్మల కౌంటర్ ఇచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం ఖమ్మం కూరగాయల మార్కెట్ తుమ్మల ప్రచారం చేస్తూ..కూరగాయల మార్కెట్, పత్తి మార్కెట్ నిర్మాణం తన హయాంలో చేశానని, రైతులకు, వ్యాపారులుకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు వసతులు కల్పించానని గుర్తు చేసారు. అరాచక శక్తులు లైసెన్స్‌ల కోసం లక్షల్లో దోచుకున్నారనీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఖమ్మంలో శాశ్వత పనులు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే మీరు కోరుకున్న పండ్ల మార్కెట్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టే శక్తులు లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు సాగాలంటే ఈ పాలకులను తరమి కొట్టాలని, మీ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తానని.. ఖమ్మంలో పువ్వాడపై గెలుపు తనదే అని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో భూ కబ్జాలు, అక్రమ కేసులు పెట్టించడం చేయలేదన్నారు. ప్రముఖ డాక్టర్ల భూములు కబ్జా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అరాచకం లేని ఖమ్మం కోసం, ప్రశాంతమైన ఖమ్మం కోసం, అన్ని వర్గాలు సంతోషంగా ఉండే ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Read Also : Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం జరిగిన గొడవల్లో 12 మంది అరెస్ట్