Thummala : రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని తుమ్మల పిలుపు

రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని, అదే ధ్వేయంతో కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేస్తే ఒక్క సూటుకేసుతో బయటికి వచ్చారని, అది చూసి చలించిపోయానని తుమ్మల చెప్పుకొచ్చారు

  • Written By:
  • Publish Date - October 22, 2023 / 04:02 PM IST

 

సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరావు (Thummala Nageswara rao) ఎన్నికలు సమీపిస్తుండడం తో మరింత దూకుడు పెంచారు. ఖమ్మం టికెట్ ఖరారు కావడం తో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ బిఆర్ఎస్ నేత పువ్వాడ ఫై విమర్శలు కురిపిస్తున్నారు. నిన్న శనివారం ఖమ్మం జిల్లా మామిళ్ళగుడెం (Mamillagudaem) లో వెంకట కృష్ణ అపార్ట్ మెంట్ లో జరిగిన ఆత్మీయ పలకరింపు లో తుమ్మల మాట్లాడుతూ బిఆర్ఎస్ (BRS) ఫై నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్ల లో బిఆర్ఎస్ విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే మన అందరికీ సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే చోట పోటీ చేయాల్సిన అవసరం ఉన్న.. ఇక్కడ అదిరిచ్చి బెదిరించి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు.. అందుకే ఇక్కడి నుండి చేస్తున్నానని తుమ్మల స్పష్టం చేశారు. ఇలాంటి కథలు నలబై సంత్సరాల క్రితమే చూసినా అని తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ఖమ్మం లో స్మిమ్మర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని, అదే ధ్వేయంతో కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేస్తే ఒక్క సూటుకేసుతో బయటికి వచ్చారని, అది చూసి చలించిపోయానని తుమ్మల చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అరాచకశక్తులను తరిమికొట్టి అభివృద్ధి రాజకీయాలకు బాటలువేయాలని సూచించారు. అంతేకాకుండా ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేతలు రజబ్‌ అలీ, బోడేపూడి, మంచికంటితో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని తుమ్మల అన్నారు.

Read Also : Telangana: 10 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఉద్యోగాల కల్పనపై దృష్టి