Site icon HashtagU Telugu

Thummala Nageswara Rao : ప్రజాస్వామ్యాన్ని BRS ఖూనీ చేసింది – తుమ్మల

thummala nageswara rao joins congress

thummala nageswara rao joins congress

తెలంగాణ ఎన్నికల (telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లో చేరిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao)..ప్రస్తుతం తన ప్రచారాన్ని స్పీడ్ చేశారు. ప్రతి రోజు పలు గ్రామాల ప్రజలతో , కార్యకర్తలతో సమావేశమవుతూ వస్తున్నారు.

శనివారం ఖమ్మం జిల్లా మామిళ్ళగుడెం (Mamillagudaem) లో వెంకట కృష్ణ అపార్ట్ మెంట్ లో జరిగిన ఆత్మీయ పలకరింపు లో తుమ్మల మాట్లాడుతూ బిఆర్ఎస్ (BRS) ఫై నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్ల లో బిఆర్ఎస్ విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే మన అందరికీ సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే చోట పోటీ చేయాల్సిన అవసరం ఉన్న.. ఇక్కడ అదిరిచ్చి బెదిరించి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు.. అందుకే ఇక్కడి నుండి చేస్తున్నానని తుమ్మల స్పష్టం చేశారు. ఇలాంటి కథలు నలబై సంత్సరాల క్రితమే చూసినా అని తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు వచ్చానని, మీ పిల్లలు విదేశాల్లో ఉంటే ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండాలనేదే నా కోరిక అన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు భయంతో గడుపుతున్నారని తెలిపారు. దేశం గర్వించేలా చేసిన నందమూరి తారక రామారావు లాంటి మహానేత ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రామారావు, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన అవకాశాన్ని జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించాలని కోరారు.

Read Also : 2 Naxalites Killed: ఎలక్షన్ వేళ ఎన్ కౌంటర్, ఛత్తీస్‌గఢ్‌ లో ఇద్దరు మావోయిస్టుల హతం