శుక్రవారం పాలేరు లో జరిగిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ (KCR Paleru Public Meeting)లో మాజీ మంత్రి , కాంగ్రెస్ నేత తుమ్మల (Thummala) ఫై సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశా అని , పాలేరు కు ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖమ్మం జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశారని నిప్పులు చెరిగారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటూ తుమ్మలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని… బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంత చేస్తే ఖమ్మంలో ఆయన పార్టీకి చేసింది గుండు సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల (Thummala) స్పందించారు. ఖమ్మంలోని 9, 41వ డివిజన్లలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో తుమ్మల మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో పాలేరులో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసు. పువ్వాడ అజయ్‌ని మంత్రిని చేయడం కోసం మీ కుమారుడు.. నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడించారు. నాడు పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయాడానికి ఎవరూ ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను అంగీకరించాననే సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు. 1995లో కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించిన విషయం మరిచారని ఈ సందర్బంగా తుమ్మల చెప్పుకొచ్చారు.
Read Also : AP Politics: వైసీపీ పొలిటికల్ థ్రిల్లర్, చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్