Bhatti Vikramarka: తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుంది: డిప్యూటీ సీఎం భట్టి

  • Written By:
  • Updated On - April 6, 2024 / 11:44 PM IST

Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ గా దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మనందరం నడుం బిగించి పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసి విజయం సాధిద్దాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తుక్కుగూడ సభలో అన్నారు.  పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ తుక్కుగూడ బహిరంగ సభ నుంచే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని భట్టి గుర్తు చేశారు.

గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ వ్యవస్థను సంక్షోభం సృష్టించి సుడిగుండంలోకి నెట్టిందని, ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం పై శ్వేత పత్రం విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెట్టామని డిప్యూటీ సీఎం అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడి లోకి తీసుకువచ్చి రాష్ట్రంలో 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.80 ఫించన్ దారులకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రకటించిన 6 గ్యారెంటీ లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించామని ఆయన అన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామని, మహిళలకు వడ్డీ లేని రుణాలు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని, జీరో బిల్లు తో 50 లక్షల మందికి ఉచితంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని భట్టీ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధిగమించి రాహుల్ గాంధీ పర్యవేక్షణలో దశ దిశ ప్రకారం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ మొదలు పెట్టామని, పీడిత బడుగు బలహీన వర్గాల బాగు కోసం ఒక విప్లవకారుడి గా రాహుల్ గాంధీ  సభలో న్యాయ్ పత్రం ఆవిష్కరించారని డిప్యూటీ సీఎం భట్టీ అన్నారు.