Site icon HashtagU Telugu

3 Killed : హైద‌రాబాద్ టోలీచౌకీలో విషాదం.. క‌రెంట్ షాక్ త‌గిలి ముగ్గురు మృతి

Death Representative Pti

Death Representative Pti

హైదరాబాద్ టోలీచౌకీలో విషాదం నెల‌కొంది. క‌రెంట్ షాక్ త‌గిలి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డంతో ఆ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. ఈ ఘటన టోలీచౌకి పారామౌంట్‌ కాలనీలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సయ్యద్ అనిసుద్దీన్ (16) అనే వ్యక్తి వాటర్ సంప్ వద్ద లైవ్ వైర్ ఉందని తెలియక ఎలక్ట్రిక్ సబ్‌మెర్సిబుల్ మోటార్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు లైవ్ వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అనిసుద్దీన్ విద్యుదాఘాతానికి గురైన స‌మ‌యంలో అతని ఇద్దరు బంధువులు రజాక్, రిజ్వాన్ అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే వారు కూడా క‌రెంట్ షాక్ త‌గిలింది. దీంతో ముగ్గురు యువకులు ఆకస్మికంగా మృతి చెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version