ఇటీవల తెలంగాణలో పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. పదవ తరగతి ప్రశ్నాపత్నం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో అధికాస్త తెలంగాణ తీవ్ర సంచలనంగా మారింది. మొదట కరీంనగర్ లో బండి సంజయ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వరంగల్ కు తరలించారు. ఇక తాజాగా ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల్లో రిమాండ్ విధించారు.
దాంతో సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్ ను ఏ 1 పేర్కొన్న పోలీసులు ఆయనపై ప్రధాన కుట్ర దారు అనే అభియోగం మోపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని తాజాగా బండి సంజయ్ కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో బండి సంజయ్ తో పాటు ముగ్గురు వ్యక్తులు అయిన ప్రశాంత్,మహేష్, శివ గణేష్ లను కూడా రిమాండ్ కి తరలించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా వరంగల్ కోర్టు విచారణ చేసి ఈ ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
సంజయ్ కస్టడీ పిటిషన్ ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అయితే A1 బెయిల్ లో బయట ఉన్నప్పుడు A2, A3,A5 ఎలా ప్రభావితం చేస్తారని బిజెపి లీగల్ సెల్ న్యాయవాదులు ప్రశ్నించారు. పదవ తరగతి పరీక్షలు నేటితో ముగిసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని బిజెపి లీగల్ సెల్ న్యాయవాదులు చేసిన వాదనకు మెజిస్ట్రేట్ ఏకీభవించింది. దాంతో న్యాయమూర్తి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. 20,000 పూచి కత్తు అనుమతి లేకుండా దేశం విడిచిపోవద్దు అనే కండిషన్ తో బెయిల్ ని న్యాయమూర్తి మంజూరు చేశారు. తనేడు సాయంత్రం లోపు కరీంనగర్ జైలు నుంచి నిందితులు ప్రశాంత్, మహేష్, శివ గణేష్లు విడుదల కానున్నారు.