Site icon HashtagU Telugu

Encounter : తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Three Maoists killed in exchange of fire on Telangana border

Three Maoists killed in exchange of fire on Telangana border

Encounter : ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాలతో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెం కర్రె‌గుట్టల్లో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు దామోదర్ లాంటి అగ్ర నాయకులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అనంతరం కర్రెగుట్టను టార్గెట్‌గా చేసుకుని 1,500 మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా , సీఆర్‌పీఎఫ్ , ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్‌‌లో పాల్గొంటున్నాయి. సుమారు 3 వేలమంది భద్రతా బలగాలతో గాలింపు కొనసాగుతోంది.

Read Also: Pakistan Official X Account: పాక్‌కు మరో దెబ్బ.. భారత్‌లో పాకిస్థాన్‌ ‘ఎక్స్‌’ ఖాతా నిషేధం!

గత మూడు రోజులుగా కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ధర్మతాళ్లగూడెం వద్ద మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. కూంబింగ్ ఆపరేషన్‌పై ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

కాగా, మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతున్నప్పటికీ, పోలీసులు అప్రమత్తంగా ఉండి, ఎన్‌కౌంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టుల కదలికలపై నిఘా కొనసాగిస్తూ, భద్రతా బలగాలు కూంబింగ్ చర్యలను ముమ్మరం చేశాయి.​ మావోయిస్టులపై జరుగుతున్న భద్రతా చర్యలు, వారి కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే, ఈ చర్యలు ప్రజల హక్కులను ఉల్లంఘించకుండా, సమర్థవంతంగా అమలు కావాలని మానవ హక్కుల సంస్థలు సూచిస్తున్నాయి.​

Read Also: India Vs Pak : ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌‌కు షాక్.. కీలక చర్యలు