Site icon HashtagU Telugu

HYD : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం…కారును ఢీకొన్న కంటైనర్ ముగ్గురు మృతి..!!

road accident

road accident

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న వింగర్ వాహనం కంటైనర్ ను వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మేడ్చల్ రిగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించినవారంతా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల కు చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వింగర్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన వారిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో కంటైనర్ ను ఢీకొన్నట్లు పోలీలు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version