Three Died: తెలంగాణలో తీవ్ర విషాదం.. ఆటోపై గ్రానెట్ రాయి పడి ముగ్గరు మృతి

మహబూబాబాద్ జిల్లాలోని వరంగల్-ఖమ్మం హైవేపై కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన భారీ ప్రమాదం (Accident) లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై గ్రానైట్ దిమ్మలు (రాళ్లు) పడటంతో ముగ్గురు వ్యక్తులు (Three Died) చనిపోయారు. ఘటన జరిగినప్పుడు ఆటోలో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం అందడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - January 1, 2023 / 07:34 AM IST

మహబూబాబాద్ జిల్లాలోని వరంగల్-ఖమ్మం హైవేపై కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన భారీ ప్రమాదం (Accident) లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై గ్రానైట్ దిమ్మలు (రాళ్లు) పడటంతో ముగ్గురు వ్యక్తులు (Three Died) చనిపోయారు. ఘటన జరిగినప్పుడు ఆటోలో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం అందడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌లతో గ్రానైట్‌ దిమ్మెలను తొలగించారు.

ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. “ఆటో గ్రానైట్ రాళ్ల క్రింద ఉన్నందున ప్రమాదంలో ఎంత మంది మరణించారో మేము ధృవీకరించలేము” అని పోలీసు అధికారి తెలిపారు. మృతులు జిల్లాలోని చిన్న గూడూరు మండలం మంగవారిగూడెం గ్రామానికి చెందినవారు.

Also Read: Murder : ఘ‌జియాబాద్‌లో దారుణం.. 60 ఏళ్ల వ్య‌క్తిని దారుణంగా…?

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం గ్రానైట్ రాయితో వెళుతున్న లారీ మహబూబాబాద్ వైపు వెళ్తుండగా మరిపెడ నుండి వస్తున్న ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా వారిపై లారీలోని గ్రానైట్ రాయి ఎగిరి పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మరణించిన వారి మృతదేహాలను, క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ కు తరలించడంతో దీంతో ఆ ప్రాంతమంతా బాధితుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో నిండిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీ మాలోత్ కవిత క్షతగాత్రులను పరామర్శించి వారిని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.