TG IAS Officers : ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్ట్ చేయాలని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజనలు వేర్వేరుగా క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. తాము తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి క్యాట్‌ను(TG IAS Officers) కోరారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన క్యాట్‌ను కోరారు. ఈ పిటిషన్లపై క్యాట్ రేపు (మంగళవారం) విచారణ చేపట్టనుంది.
Also Read :Nobel Prize : ముగ్గురు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా ఆర్థికశాస్త్ర నోబెల్ ప్రైజ్
- ఏపీకి కేటాయించినప్పటికీ .. ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల జాబితాలో వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు.
- ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్ అధికారుల జాబితాలో.. సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు.
- తమను ఏపీ నుంచి తెలంగాణకు పంపమని ఐఏఎస్ అధికారులు ఎస్.ఎస్.రావత్, అనంతరాము పెట్టుకున్న అభ్యర్థనలను డీవోపీటీ ఇప్పటికే తిరస్కరించింది. దీంతో వీరు ప్రస్తుతం ఏపీలోనే కంటిన్యూ అవుతున్నారు.
- ఏపీ విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఇందులో కొందరు అధికారులు తమను ఏపీ కేడర్‌కు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కేడర్‌గా గుర్తించాలని కోరుతూ పలు కారణాలను చూపించారు.
- అయితే అప్పట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్.. క్యాట్‌ను ఆశ్రయించింది. ఆనాడు అధికారుల అభ్యర్థనను క్యాట్ పరిగణలోకి తీసుకుంది. క్యాట్ ఇచ్చిన తీర్పును డీఓపీటీ.. తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై 2023 మార్చిలో విచారణ జరగగా.. అధికారుల అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.
- హైకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం.. దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిషన్‌ను ఈ ఏడాది మార్చి 21న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను రెజెక్ట్ చేసింది.
- ఈ క్రమంలోనే ఏపీ కేడర్‌కు డీఓపీటీ కేటాయించిన ఆలిండియా సర్వీస్ అధికారులను ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందిగా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ తేదీకి మరో రెండు రోజులు ఉందనగా.. డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ నలుగురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు.