తెలంగాణా(Telangana)లో మద్యం అమ్మకాల (Alcohol sales) గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తుంది. అందుకే ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాలు అందజేస్తూ ముందుకు వెళ్తుంది. అలాంటి మందు బాబులకు రెండు బీర్ సంస్థలు షాక్ ఇచ్చాయి. కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్లను (Kingfisher, Heineken Beer) సరఫరా చేయలేమని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.
Varra Ravindra Reddy : పోలీసుల అదుపులో వర్రా రవీంద్రారెడ్డి
గత ఐదేళ్లుగా బీర్ల ధరలు పెంచేందుకు తెలంగాణ బీర్వేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుబీఎల్ తెలిపింది. యుబీఎల్ ప్రకారం.. ప్రస్తుత ధరలతో బీర్లను సరఫరా చేయడం వల్ల భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో అనేక సార్లు చర్చించినప్పటికీ, ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఈ రెండు బ్రాండ్ల బీర్లు దొరక్కపోవడంతో మందుబాబులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీటి లభ్యత కొరతగా మారింది. ఈ సమస్యపై కొంత మంది జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు కూడా చేసినట్లు సందర్భాలు ఉన్నాయి.
కింగ్‌ఫిషర్, హీనెకిన్ బీర్ల లభ్యత తగ్గిపోవడంతో ఇతర బ్రాండ్లు మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మద్యం ప్రియులకు ముఖ్యంగా కింగ్‌ఫిషర్ బ్రాండ్ అనేది ఎంతో ఇష్టం. డబుల్ రేటు పెట్టైనా ఈ బీర్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. గత పదేళ్లు గా ఈ బీర్ తెలంగాణ లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. పట్టణాల్లోనే కాదు మారుమూల పల్లెలో కూడా ఈ బీర్ లభ్యం అవుతుంటుంది. అలాంటి ఈ బీర్ ఇక కనిపించదు అంటే బీర్ బాబులు ఎలా తట్టుకుంటారో ఏమో. బీర్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మారే అవకాశం ఉంది. యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్‌తో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపి, ఈ బ్రాండ్లను మార్కెట్లో తిరిగి అందుబాటులోకి తేవాలని మందుబాబులు కోరుతున్నారు.