Hyderabad Mosque : హైదరాబాద్‌లో వందలాదిగా చారిత్రక మసీదులు ఉన్నాయి. వాటికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మంది ప్రముఖులతో ఆయా మసీదులకు మతపరమైన అనుబంధం ఉంది. అయితే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఒక మసీదును స్పెయిన్ పర్యాటకులు స్పెషల్‌గా పరిగణిస్తున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా హైదరాబాద్‌కు వచ్చి ఆ మసీదును చూసి వెళ్తున్నారు. ప్రత్యేకించి స్పెయిన్ దేశానికి చెందిన టూరిస్టులను ఆకట్టుకునేంతగా ఆ మసీదులో ఏముంది ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Red Briefcase : బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎరుపు రంగులోనే ఎందుకు ? ఎన్నో కారణాలు
ప్రకాశ్ నగర్‌లో..
స్పెయిన్ టూరిస్టులను ఆకట్టుకుంటున్న ఆ మసీదును చూసేందుకు మనం హైదరాబాద్ సిటీలోని బేగంపేట ఏరియాకు వెళ్లాలి. బేగంపేటలోని ప్రకాశ్ నగర్‌లో ఒక పెద్ద మసీదు ఉంది. దాని కట్టడం అద్భుతంగా ఉంటుంది. స్పెయిన్ దేశంలో ఉన్న చారిత్రక ఖ్యాతి కలిగిన ఒక మసీదును తలపించేలా ప్రకాశ్ నగర్‌లోని మసీదును నిర్మించారు. అందుకే దీన్ని అందరూ ‘‘స్పానిష్ మాస్క్ బేగంపేట్’’ అని పిలుస్తుంటారు. వికీపీడియాలో మీరు ఈ మసీదుకు సంబంధించిన అన్ని వివరాలను చూడొచ్చు.
Also Read :Telangana Number 1 : ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించిన ‘తెలంగాణ’ ఘనతలివీ
1897 సంవత్సరంలో..
ఈ మసీదును చూడటానికే చాలామంది స్పెయిన్ దేశ టూరిస్టులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారట. ఈ మసీదును(Hyderabad Mosque) స్పానిష్ వాస్తు శైలిలో, యూరోపియన్, మొగలాయి రకాలకు చెందిన భవన నిర్మాణ అందాలను కలగలిపి నిర్మించారు. అందుకే ఇది చూడటానికి అద్భుతంగా కనిపిస్తుంది. ఈ మసీదులో 8 ముఖాలు గల రెండు గుమ్మటాలు ఒక దానిపై ఒకటి ఉంటాయి. దీన్ని నిర్మించి దాదాపు 120 ఏళ్లు గడిచాయి. అయినా ఈ మసీదు ఇంకా కొత్తదానిలాగే కనిపిస్తుంటుంది. 1897 సంవత్సరంలో పైగా రాజవంశానికి చెందిన ఐదో అమీర్, హైదరాబాద్ ప్రధానమంత్రి సర్ వికార్ ఉల్ ఉమ్రా స్పెయిన్ దేశ పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ తర్వాతే ఆయన బేగంపేటలో ఈ మసీదును నిర్మించారు. స్పెయిన్‌లో తాను చూసిన చారిత్రక మసీదు నమూనాలో ప్రత్యేక శ్రద్ధతో దీన్ని తయారు చేయించారు. ఈక్రమంలో ఖర్చుకు ఆయన అస్సలు వెనుకాడలేదు. 1897లో ఈ మసీదు నిర్మాణ పనులు ప్రారంభించగా, 1902లో సర్ వికార్ ఉల్ ఉమ్రా తుదిశ్వాస విడిచారు. ఈ స్పానిష్ మోడల్ మసీదు నిర్మాణాన్ని ఆయన కుమారుడు సుల్తాన్ ఉల్ ముల్క్ పూర్తి చేయించారు. ఈ మసీదు నిర్మాణానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. పైగా రాజవంశానికి బేగంపేట ప్రాంతంలో దాదాపు 1600 ఎకరాల్లో విలువైన భూములు ఉన్నాయి.