KCR: కేసీఆర్ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న‌.. షాకింగ్ రీజ‌న్ ఇదే..!

  • Written By:
  • Publish Date - February 4, 2022 / 04:24 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల రిజ‌ల్ట్ పై చేసిన వ్యాఖ్య‌లు రాజకీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన బడ్జెట్ పై మీడియా సాక్షిగా, బీజేపీ స‌ర్కార్ పై కేసీఆర్ త‌న‌దైన స్టైల్‌లో నిప్పులు చెరిగారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల పై కూడా సీయం కేసీఆర్ సంచ‌ల‌న జోస్యం చెప్పి రాజకీయ‌వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే లేపారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో మ‌రోసారి టీఆర్ఎస్ విజ‌య‌భేరి మోగించ‌డం ఖాయ‌మ‌ని, బీజేపీ, కాంగ్రెస్‌లు త‌మ‌కు పోటీయే కాద‌ని, దాదాపు 100కు పైగానే నియోజ‌కవ‌ర్గాల్లో గులాబీపార్టీ విజ‌యం సాధించి హ్యాట్రిక్ కొడ‌తామ‌ని కేసీఆర్ ర‌చ్చ వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో కేసీఆర్ వ్యాఖ్య‌ల పై రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాకుండా, రాజ‌కీయ నిపుణుల్లో కూడా పెద్దఎత్తున చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ఈ నేప‌ధ్యంలో అస‌లు కేసీఆర్‌కు అంత కాన్ఫిడెన్స్ ఏంటీ, ఖ‌చ్ఛితంగా మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని , అంత ధీమాగా కేసీఆర్ ఎలా చెప్ప‌గ‌ల్గుతున్నారు, తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్య‌ర్ధి పార్టీలు పోటీ ఇవ్వ‌లేకపోత‌న్నాయనా లేక రాష్ట్ర ప్ర‌జ‌ల్లో అదికార ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త లేద‌ని గులాబీ బాస్ భావిస్తున్నారా అనేది తెలంగాణ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో పెద్దఎత్తున‌ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇక కేసీఆర్ వ్యాఖ్య‌ల వెనుక షాకింగ్ రీజ‌న్ ఏంటంటే, ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప్ర‌యివేటు సంస్థ‌ల‌తో కేసీఆర్ సీక్రెట్ స‌ర్వేలు చేయించార‌ట‌. ఆ స‌ర్వే రిపోర్ట్స్‌లో ఈసారి టీఆర్ఎస్‌కు 35 నుండి 50 స్థానాల్లో మాత్ర‌మే గెలిచే అవ‌కాశం ఉంద‌ని తేలిన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల హుజూరాబాద్ ఉపఎన్నిక‌లో అన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తేనే గెల‌వ‌లేక‌పోయిన టీఆర్ఎస్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, న‌ల్గొండ వంటి జిల్లాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చ‌చ్చీ చెడీ గెలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈసారి టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీకాద‌ని గ్ర‌హించిన కేసీఆర్, మూడోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ఇప్ప‌టినుంచే ద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని, అందుకే స‌ర్వేలు చేయించి ముందుగానే ఎమ్మెల్యేల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్ర‌శాంత్ కిషోర్ టీమ్‌ను రంగంలోకి దింపి బీజేపీ పై కాలు దువ్వుతున్నారు. ఈసారి ఎక్కువ సంఖ్య‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చే చాన్స్ ఉంద‌ని, అదే ఫార్ములాతో ప‌శ్చిమ‌బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్టీ హ్యాట్రిక్ కొట్టార‌ని, ఇప్పుడు కేసీఆర్ కూడా సేమ్ ఫార్ములాతో వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నార‌ని, అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ వంద‌కు పైగానే సీట్లు ద‌క్కించుకుంటుంద‌ని కేసీఆర్ కాన్ఫిడెన్స్‌తో వ్యాఖ్య‌లు చేశార‌ని రాజకీయ‌వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌జ‌రుగుతుంది.