Owaisi – Palestine : పాలస్తీనా యుద్ధంపై ప్రధాని మోడీకి ఒవైసీ సూచన.. ఏమన్నారంటే ?

Owaisi - Palestine :  ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 03:52 PM IST

Owaisi – Palestine :  ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పైశాచిక చర్యల వల్ల బలి అవుతున్న గాజా ప్రజలపై కనీస మానవత్వంతో సానుభూతి చూపించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన డిమాండ్ చేశారు. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పాలస్తీనా పౌరులపై  ఇజ్రాయెల్  చేస్తున్న ఈ దాడులను ఖండించాలని ప్రధానిని కోరారు. దీన్ని కేవలం ముస్లింల సమస్యగా చూడొద్దన్నారు.  మానవతా కోణంలో ఆలోచించి పాలస్తీనాకు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడు, డెవిల్.. అతడొక నియంత పాలకుడు అని ఒవైసీ ఫైర్ అయ్యారు. నెతన్యాహు చేష్టల వల్లే 10 లక్షల మంది గాజా పౌరులు ప్రస్తుతం నిరాశ్రయులయ్యారని ఆరోపించారు. ప్రపంచమంతా ఈ విధ్వంసంపై నోరు మెదపకపోవడం సరికాదన్నారు. ఇజ్రాయెల్ పై దాడి చేసిన వాళ్లెవరో కనిపెట్టి చంపాలే తప్ప.. గాజాలోని అమాయక పౌరుల జీవితాలను నాశనం చేయడం సరికాదని హితవు పలికారు. గాజా ప్రజలను అక్కడి నుంచి పంపించి, ఆ భూభాగాన్ని కూడా కబ్జా చేయాలనే కుట్రతో ఇజ్రాయెల్ ఉందని ఒవైసీ అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న భీకర పోరులో తాము ఇజ్రాయెల్‌ వెంటే ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితిపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజామిన్‌ నెతన్యాహుతో తాను ఫోన్‌లో మాట్లాడానని చెప్పారు. భారత్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకమని, అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని భారత ప్రధాని స్పష్టం చేశారు.

Also Read: 3 Hour Deadline : 3 గంటల్లోగా ఇళ్లు విడిచి వెళ్లిపోండి.. గాజన్లకు ఇజ్రాయెల్ వార్నింగ్